Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల కేంద్రంలోని మసీదు సెంటర్ లో నిజాం నవాబు కాలం నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ బుధవారం విజయదశమి రోజున త్రివర్ణపతాకాన్ని సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ ఎగుర వేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బన్సీలాల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దసరా పండుగ రోజున జాతీయ పతాకాన్ని ఎగుర వేసే చరిత్ర ఉందని తెలిపారు. నిజాం నవాబు కాలంలో ఏర్పాటు చేసిన పోలీసు ఠానాలో ఆయుధ పూజ నిర్వహించి నెల వంక ఉన్న పచ్చ జెండాను ఎగుర వేశారని తెలిపారు. ఈ క్రమంలో మొదటి సారిగా జరిగిన మున్సి పాలిటీ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున మాటేటి కిషన్‌రావు ఎన్నిక కాగా జెండా ఎగుర వేసే విషయంలో కాంగ్రెస్,కమ్యూనిస్టు ల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా అనవాయితీగా జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయిం చారని అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ఎగుర వేసే సాంప్రదాయాన్ని కొనసాగి స్తున్నామని తెలిపారు. జాతీయ జెండా ఆవిష్క రణ అనంతరం అంజనేయ స్వామి ఆలయం లో జమ్మి చెట్టు కు పూజలు నిర్వహించి, పాలపిట్ట ను దర్శించుకున్నారు. ముందుగా గ్రామ పంచా యతీ కార్యాలయం నుండి పట్టణ పురవీధుల గుండా మెళ తాళాలతో జాతీయ జెండాను చేత బట్టుకొని ఊరేగించారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కె.మహేశ్వరావు,కార్యదర్శి కుమార్ స్వామి, వార్డు సభ్యులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,పురప్రముఖులు ఉన్నారు.