Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు కృతజ్ఞతలు
- మున్సిపల్ చైర్మన్ వాంకుడొత్ వీరన్న
నవతెలంగాణ - డోర్నకల్
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణలో డోర్నకల్‌కు 3వ స్థానంలో నిలిచిందని మున్సిపల్ చైర్మెన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. గురువారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్- 2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయన్నారు. అందులో డోర్నకల్ పురపాలక సంఘంకు 3వ స్థానం దక్కిందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవా ర్డులను ప్రదానం చేశారన్నారు. ఆయా అవార్డుల ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయా పట్టణాల చైర్మన్లు, చైర్‌పర్సన్స్ అందుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి డోర్నకల్ మున్సిపాలిటీకి, స్వచ్ఛ తెలంగాణకు అవార్డులు దక్కడంపై డోర్నకల్ పురపాలక శాఖ నుంచి కేటీఆర్‌కు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మార్గనిర్దేశనం చేస్తూ, పర్యవేక్షించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ,ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో వైస్ చైర్మెన్ కోటి లింగం, వార్డు కౌన్సి లర్లు పోటు జనార్ధన్, కో ఆప్షన్ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.