Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
గీత వృత్తిని పరిశ్రమగా గుర్తించాలని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిర్ర వెంకటేశ్వర్లుగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని నైనాలలో శ్రీ కంఠమహేశ్వర ఆలయ ప్రాంగణం వద్ద 8న నిర్వహించ తలపెట్టిన గీత పనివారల సంఘం జిల్లా ప్రథమ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కల్లువిక్రయానికి మార్కెట్ సదుపాయం కల్పించాలని, ద్విచక్ర వాహనాలు అందజేయాలని కోరారు. సంఘం వ్యవస్థాపకులు స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం నేతృత్వంలో గార్ల మండలంలో స్థాపించిన సంఘం అనేక ఉద్యమాలు నిర్వహించి హక్కులకోసం పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం కురవి మండల కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలకు రాష్ట్ర నాయకత్వం బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, సాయిల్ గౌడ్, పోగుల శ్రీనివాస్ గౌడ్,కెవిఎల్ గౌడ్, నాగభూషణం,కోటయ్య గౌడ్ హాజరవుతున్నారని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా మండల ప్రధాన కార్యదర్శిపెరుమాండ్ల యాదగిరి గౌడ్, సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్ష కోశాధికారులు నల్లమాససమ్మయ్య గౌడ్,పెరమండ్ల వీరభద్రయ్య, ఉపేందర్ గౌడ్, సొసైటీ సీనియర్ నాయకులు చిర్ర శ్రీనివాస్, పెరుమాండ్ల సూరయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.