Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రర్ ఆర్టీసీ బస్టాండ్ గురువారం ప్రయాణికులతో కిటకిట లాడింది. దసరా తర్వాత రోజు కావడంతో పండుగకు వచ్చిన మహిళలు, ఉద్యోగస్తులు తిరుగు ప్రయాణం పట్టారు. హైదరాబాదుకు తదితర ప్రాంతాలకు వెళ్లేం దుకు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పడగాపులు కాశారు. తొర్రూర్ ఆర్టీసీ డిపో నుండి రూట్ల వారిగా బస్సులు కేటాయించకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ కు ప్రయాణికులు ఫోన్ చేసినా స్పందించకవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోలర్‌ను ప్రయాణికులు బస్సుల గురించి వివరాలు అడ గగా గురువారం 45 బస్సులను డిపో మేనేజర్ నడపవద్దని తమకు ఆదేశా లు ఇచ్చారని వెల్లడించారు. దీంతో ప్రయాణికులు విస్తుపోయారు. ఆర్టీసీ బస్సులు టైంకు రాక, ప్రైవేటు వాహనాలు లేక ఇబ్బంది పడ్డారు. మహ బూబాబాద్, ఖమ్మం, నర్సంపేట, వరంగల్, హైదరాబాద్, సూర్యాపేట, రూట్లలో వెళ్ళవలసిన బస్సులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బస్సులను కుదించిన డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ఆర్టీసీకి ఆదాయం లేదని ఒకవైపు చెబుతూనే మరోవైపు బస్సులను రద్దు చేయడం ఏమిటని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.