Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్
నవతెలంగాణ-నెల్లికుదురు
నగదు బదిలీ నిర్ణయం జీఎంపీఎస్ పోరాట ఫలితమే అని జీఎంపీఎస్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ అన్నారు. గురువారం నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గ్రామ సొసైటీ అధ్యక్షులు దుబార్ల సాయిలు, సంఘం మండల సహాయ కార్యదర్శి నక్క హరీష్ అధ్య క్షతన నిర్వహించిన సమావేశంలో అశోక్ పాల్గొని మాట్లాడారు. అనం తరం గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో గొర్ల కాపరులు అశోక్ ను సన్మానం చేశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాట ఫలితంగా పైలెట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గం ఎంపిక చేసిందన్నారు. సుమారు 5,800 మంది గొల్ల కురుమల అకౌంట్లలోకి ఎన్నికల కోడ్ రాకముందే డబ్బులు జమ చేయాలని అన్నారు. ఒక్కొక్కరికి అకౌంట్లో 1.58లక్షల చొప్పున జమ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. గొల్ల కురుమల లబ్ధిదారులకు అకౌంట్లను ఫ్రీజింగ్ చేయా లని ఎంపీడీఓ ద్వారా బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. రైతుబంధు మాదిరిగా గొల్ల కురుమలకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. లేదంటే వారి సంతకాలతో మాత్రమే గొర్రెల అమ్మకందార్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేలా చూడాలని అన్నారు. ఈ నగదు బదిలీ కార్యక్రమం ఒక మునుగోడు కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దబోయిన రాజాలు, శోభనబోయిన వెంకన్న, నక్క యకన్న,దుబర్ల మధు,జంగా వీరన్న, జక్కుల యకాంతం చిరబోయిన వెంకన్న, సంగే మల్లయ్య, శోభన బోయిన యాకన్న, వంగ మల్లయ్య, రాములు, కొమురయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.