Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రావణ వధ వేడుకల్లో మంత్రి
నవతెలంగాణ-తొర్రూరు
చెడుపై మంచి సాధించిన విజయమే విజj దశమి వేడుకలు అని, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బుధవారం రాత్రి తొర్రూరు మున్సిపల్ పరిధిలోని స్వర్గీయ యతి రాజారావు స్మారక చిల్డ్రన్స్ పార్కులో, అన్నారం రోడ్డు లోని శక్తి స్థలం లో జరిగిన రావణ వద కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దసరా రోజున పాలపి ట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును పరస్పరం పంచుకొంటూ అలరు బలరు తీసుకోవడం గొప్ప సాంప్రదాయమని చెప్పారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్ర గామిగా నిలిచిందన్నారు. అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారిందని చెప్పారు. విజయాలు సాధిస్తూ, సీఎం కెసిఆర్ కుటుంబం సహా, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షొంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్కు బదులు బీఎస్సీ అన్న మంత్రి
సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తరహా లోనే దేశాన్ని బాగు చేసేందుకు బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు. పక్కనే ఉన్న నాయకులు బీఎస్పీ కాదు బీఆర్ఎస్ అని చెప్పేందుకు సాహసం చేశారు. కానీ మంత్రి ఎర్రబెల్లి తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అక్కడున్న ప్రజలు నాయకులు విస్తుపోయారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, ఎంపీపీ అంజయ్య, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, రామసహాయం కష్ణ కిషోర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ హరి ప్రసాదరావు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పి సోమేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.