Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెసిఆర్ నియంత ధోరణితో రాష్ట్రం అతలాకుతలం
- నేడు టిఆర్ఎస్లో రాజ్యమేలుతున్న కుల రాజకీయాలు
- నాటి ఉద్యమ ద్రోహులకు నేడు మంత్రి పదవులు
- కష్టించే కార్యకర్తలను అంటరాని వారిగా చూస్తున్న ఎమ్మెల్యే
- పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి
నవతెలంగాణ - పరకాల
తెలంగాణ రాష్ట్రంసాధన కోసం ప్రాణాలను లెక్కచేయకుం డా నిరంతరం పోరాటం చేసిన ఉద్యమకారులను సిఎం కె.చం ద్రశేఖర్రావు విస్మరిస్తుండడం, పార్టీ విధివిధానాలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే మొలు గూరి బిక్షపతి అన్నారు. గురువారం పట్టణంలోని ఆదర్శనగర్ నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు కోసం 2001 నుండి నాగూర్ల వెంకటేశ్వర్లు, సిరికొండ మధు సూదనచారిల సహకారంతో టిఆర్ఎస్ పార్టీలో చేరి నాటి నుండి నేటి వరకు పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ బలోపేతానికి ఎంతో కషి చేయడం జరిగిందన్నారు. దాని ఫలితంగా 2009లో మాజీమంత్రి కొండా సురేఖపై ఉప ఎన్నికల్లో సిఎం కేసీఆర్ ఆదేశం మేరకు పోటీ చేసి విజయం సాధించానని పేర్కొన్నారు. నాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఐక్యత నేడు లేదని, కుల వ్యవస్థ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. నాడు తెలంగాణ ఉద్య మానికి ద్రోహం చేసిన టిడిపి, కాంగ్రెస్ నాయకులను నేడు పార్టీ లోకి తీసుకొని మంత్రు పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. సిఎం కేసీఆర్ విధివిధానాలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా టిడిపి నుండి గెలిచిన ధర్మారెడ్డి మొదటి నుండి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులపట్ల వివక్ష చూపుతూ వర్గభేదంతో పదవులను ఇవ్వకుండా వారికి తీరని అన్యాయం చే స్తూ వారిని అంటరాని వారిగా చూస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కేసీఆర్ నియంత ధోరణితో రాష్ట్రం అతలాకుతం కాబో తుందని, బిజెపితోనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందనే భావనతో ఈనెల 9న మెదక్ జిల్లా నరసాపురంలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. నేను ఎవరికి భయపడను ఎవరికి గులాంగిరి చేయా ల్సిన అవసరం లేదని కేసిఆర్ పాలన కేవలం కుటుంబ సభ్యులకే తప్ప ఉద్యమకారులకు కాదన్నారు. సిఎం కేసీఆర్ కమిషన్లు వచ్చే పథకాలను తప్ప ప్రజలకు న్యాయపరమైన పథకాలను అందుబాటులోకి తీసుకురావడం లేదని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గంలో కుల రా జకీయాలు చేస్తూ దళితులను అణగదొక్కుతున్నారని వచ్చే ఎన్ని కల్లో ధర్మారెడ్డి పోటీ చేస్తే పరకాల పట్టణంలోని మూడు దళిత కాలనీలోని ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు వాకి ఖాతాల్లో జమ చేసిన తర్వాతే పోటీలోకి రావాలని సవాల్ విసిరారు. పట్టణం లోని 9వవార్డులో బిజెపి అభ్యర్థి బెజ్జంకి పరిపూర్ణ చారిని ఓడించ లేని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి దళితుడని, ప్రతీ దళిత పేదవాడికి మూడెకరాలు భూమి ఇస్తానని సిఎం కెసిఆర్ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం పనికి మాలిన చర్య అని అన్నారు. దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఎన్నికల తర్వాత కెసిఆర్ బలం ఏంటో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రజా కంటకుడిగా తయారవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పరకాలలో ఇక రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలని టిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే భయం లేదు... నేనంటేనే కెసిఆర్ కు భయం అని పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శకం ముగిసినట్లే అన్నారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన మార్త రాజభద్రయ్య, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మొలుగూరికి బిజెపిలోకి ఆహ్వానం
ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతిని గురువారం బిజెపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెసరు విజరు చందర్రెడ్డితో పాటు బిజెపి నాయకులు మొలుగూరి బిక్షపతిని శాలువాతో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మార్గ బిక్షపతి, పుట్ట రవీందర్, గోగుల రాజిరెడ్డి, ఆర్పి జయంతిలాల్, గురు ప్రసాద్, ఎర్రం రామన్న, కౌన్సిలర్లు భద్రయ్య, పూర్ణాచారి, నిరంజన్, రాజవీర్, రాంబాబు, చక్రపాణి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.