Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
నేటి సమాజానికి గౌతమ బుద్ధుని బోధనలు అవసరమని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. 5 అక్టోబర్ (బుధవారం) అశోక విజయదశమి సందర్భంగా విశ్వవిద్యాలయ గ్రంధాలయ ప్రాంగణంలో విశ్రాంత ఆచార్యులు ఆచార్య ఎం.ఎర్రగట్టు స్వామి అద్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. ముందుగా లైబ్రరీ ప్రాంగణంలోని బుద్ధ విగ్రహం ముందు కొవ్వత్తులు వెలిగింఛి, పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివక్ష ఒప్పందనియం కాదన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కుడా బుద్ధుని బోధనలు, బౌద్ధమతము సిద్ధాంతాలకుఆకర్షితులయ్యారని అన్నారు. నేటి ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నదన్నారు. ప్రపంచ దేశాలన్నీ బౌద్ధమతమును గౌరవిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రామరెడ్డి, విశ్వవిద్యాలయ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య వి.రామచంద్రం, అడ్మిషన్ల సంచాలకులు ఆచార్య వాసుదేవరెడ్డి, లైబ్రరియన్ టి.జావేర్, డాక్టర్ ఎల్.పి.కుమార్, డాక్టర్ గాదె సమ్మయ్య, డాక్టర్ కే.వెంకటి, రౌత్ రమేష్, డి.నర్సయ్య, ఎం.ఎల్లయ్య, బొమ్మల్ల అంబేద్కర్, కే.సురేందర్, ఎం.విశ్వేశ్వర్, ఎం.లక్ష్మి నారయణ, జి.జగదీశ్వర్, కే.నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.