Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఎస్డీ గౌష్ ఆలం
- వైభవంగా రావణాసురవధ
- అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు
- వర్షం పడినా కొనసాగిన ఉత్సవం
నవతెలంగాణ-ములుగు
భారతదేశ సనాతన ధర్మం ప్రకారం అసుర శక్తిపై దైవీ శక్తి విజయంగా రావణాసురవధ కార్యక్రమం నిర్వహించుకోవడం, ప్రశాంత వాతావరణంలో ఉత్స వం నిర్వహించడం అభినందనీయమని ములుగు, భూపాలపల్లి జిల్లాల ఓఎస్డీ గౌష్ ఆలం అన్నారు. ఏ యుగంలోనైనా మంచి మాత్రమే గెలుస్తుందని స్పష్టం చేశారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని బుధవారం ములుగులో ధర్మజాగరణ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో సాధన స్కూల్ సమీపంలో ఎన్‌హెచ్ వెంట నిర్వహించిన రావణవధ కార్యక్రమానికి ఓఎస్డీ, ఏఎ స్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, జెడ్పీటీసీ సకినాల భవానితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మం చి, చెడులపై అవగాహన కల్పించాలన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు, గురువు లు, భార్యా భర్తలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల బంధాలపై రామాయణం విలు వలను నేర్పుతుందన్నారు. మంచిని మాత్రమే తమ పిల్లలకు అలవాటు చేస్తే సమాజంలో అల్లర్లు జరగవన్నారు. ప్రజలు శాంతియుతంగా జీవించాలన్నారు. వర్షం అంతరాయం కల్పించినా కూడా రావణావధ ఉత్సవాన్ని విజయవతంగా పూర్తిచేసిన ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
గుజ్జుల నర్సయ్యకు నివాళులు..
దసరా సందర్భంగా 18 ఏళ్లుగా నిర్వహిస్తున్న రావణవధ, 4 ఏళ్లపాటు దీపావళి సందర్భంగా నిర్వహించిన నరకాసురవధ కార్యక్రమాలకు ముఖ్య అతిది ¸గా హాజరైన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ గుజ్జుల నర్సయ్యకు సభా వేదికపై నివాళులర్పించి మౌనం పాటించారు. నర్సయ్య చిత్రపటానికి పూల మా ల వేసి ఆయన గొప్పతనాన్ని, సమాజంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు..
రావణవధ ఉత్సవం ప్రారంభానికి ముందే వర్షం అంతరాయం సష్టించినా ప్రజలు మాత్రం ప్రశాంతంగా కార్యక్రమం పూర్తయ్యేవరకు చూశారు. ములుగుకు చెందిన చిన్నారులు సుమన శ్రీ, కస్తూరి చందన కూచిపూడి నాట్యం, కళాకారుడు శంకర్, అరుణ్ పాడిన పాటలు అలరించాయి. అదేవిధంగా మల్లెపందిరి, నాగు పాము ఆకృతిల బాణాసంచా అబ్బురపరిచింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం చేశారు. ములుగుకు చెందిన యోగా గురు శివకష్ణ ఉచితంగా యోగా, హీలింగ్ థెరపీ నిర్వహిస్తూ ఆల్ ఇండియా వ్యాప్తంగా 300లమంది వద్ధులకు ఆరోగ్య పరమైన సలహాలు ఉచితంగా అందిస్తున్నందుకు, ఏజెన్సీ ప్రాతంలో 18 క్యాంపులు నిర్వహించి ఉచితంగా యోగా నేర్పించినందుకు శాలువాతో సన్మానించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో ములుగు సీఐ రంజిత్ కుమార్, సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, ఎస్సై బి.ఓంకార్ యాదవ్, సర్పంచ్ బండారి నిర్మల హరినాథం, డాక్టర్ సుతారి సతీస్, తుమ్మ పిచ్చిరెడ్డి, కర్ర రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, సముద్రాల రఘు, సత్తు రామనాదం, బోగినేని వెంగయ్య, వేల్పూరి సత్యానారాయణ రావు, గంగిశెట్టి శ్రీనివాస్, కనుకుల చంద్రారెడ్డి, శీలమంతుల నర్సింహాచారి, చల్లగొండ పద్మా కర్‌రెడ్డి, గండ్రకోట రవీందర్, బద్దం సుదర్శన్ రెడ్డి, చింతనిప్పుల భిక్షపతి, ఆరె విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత స్థలంలో ఘనంగా రావణ వధ వేడుకలు
కాశిబుగ్గ : ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా కాశిబుగ్గ దసరా ఉత్స వాలను జరుపుకోవడం కోసం ఈ సంవత్సరం శాశ్వత స్థలం కేటాయించినట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో జరిగిన రావణవధ కార్యక్రమంలో ముందుగా ప్రారంభమైన సాంస్కతిక కార్యక్రమాలకు ఇంతే జార ్గంజ్ సిఐ మల్లేష్, ఎస్సైలు శ్రీకాంత్, శివకుమార్ లు ప్రారంభించగా ముఖ్య అతి థిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కాశిబుగ్గ దసరా ఉత్సవ కమిటీ రావణ వధ కార్యక్రమానికి స్థలం కోసం ఇబ్బందులు పడు తున్నా రని ఆ సమస్యని ప్రభుత్వం సహాయంతో పరిష్కరించినట్లు చెప్పారు. అలాగే కాశిబుగ్గ ప్రాంతాన్ని మరింతగా అభివద్ధి చేసి చూపెడతామన్నారు. రావణాసుర ప్రతిమను తయారు చేయించి కార్యక్రమాలను దగ్గరుండి నడిపిస్తున్న గుల్లపల్లి రాజ్ కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల కమిటీ చిరకాల కల నెరవేరిందని దసరా ఉత్సవాల నిర్వహణకు 10 ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా వడ్డేపల్లి చెరువు బండ్‌కు రూ.4 కోట్ల కేటాయించినందుకు కమిటీ తరపున ఎమ్మెల్యేకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసేలా సహకరించిన పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి, విద్యుత్ శాఖ అధికారులకు, అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ బయ్య స్వామి ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, స్వర్ణలత భాస్కర్, తూర్పా టి సులోచన, వాసుల బాబు బాల్నే సురేష్, కమిటీ సభ్యులు ఓం ప్రకాష్ కొలారి యా, గుత్తికొండ నవీన్, గోరంట్ల మనోహర్, దుబ్బ శ్రీను, చిలువేరు శ్రీనివాస్, వేముల నాగరాజు, మార్త ఆంజనేయులు మార్టిన్ లూథర్, గుల్లపల్లి సాంబశివుడు, గనిపాక సుధాకర్, చిలువేరు థామస్, ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.
యువసేన యూత్ ఆధ్వర్యంలో రావణవధ
పర్వతగిరి : మండలంలోని ఏనుగల్లులో దసరా పండుగను పురస్క రించుకొని యువసేన యూత్ ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు గడ్డం లింగమూర్తి ఆధ్వ ర్యంలో రావణ ప్రతిమకు నిప్పంటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాగితాల సురేష్, కార్యదర్శి శీలం నాగరాజు, సర్పంచ్ దమిశెట్టి సంధ్య రాణి నర్సింగం, జెడ్పిటిసి సింగులాల్, ఎంపీటీసీ కోల మల్లయ్య, తక్కళ్లపల్లి నారాయణరావు, భాస్కరరావు, బొంపెల్లి దేవేందర్ రావు, ఉప సర్పంచ్ పెండ్లి రమేష్, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గూడ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతనెక్కొండలో
మండలంలోని చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మ ఆధ్వర్యంలో బుధవారం రావణవధ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, ఎంపిటిసి లు మౌనిక, సుభాషిణి, డీఆర్ఎస్ మండల నాయకులు గటిక మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఫొటో గోవిందరావుపేట రావణవధ
గోవిందరావుపేట : దసరా వేడుకలను మండల వ్యాప్తంగా బుధవారం ప్రజ లు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో రావణవధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పస్రాలో గత 20 సంవత్సరాల నుండి కొనసాగుతున్న రావణవధ ఈ సారి వర్షం కారణంగా కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పస్రా పోలీ స్ స్టేషన్లో సిఐ శంకర్ ఎస్సై కరుణాకర్ రావులు ఆయుధ పూజ చేశారు. పసర సర్పంచ్ ముద్దబోయిన రాము ప్రజల హర్షద్వానాలు నత్యాల మధ్య బాణాసంచా పేలుళ్లతో దసరా వేడుకలను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఘనంగా నిర్వహిం చారు. వ్యవసాయ క్షేత్రంలో పాలపిట్టను చూసేందుకు ప్రయత్నించారు.