Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదుల పెట్టె ఏర్పాటులో రాజకీయ అంతర్యం
- సంస్కరణల ఫలితంగా పాండిచ్ఛేరి అంధకారం
- తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కేంద్రం
- దేశ నవశకానికి బీఆర్ఎస్ నాంది
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సంస్కరణలపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నోరు మెదపాలని రాజ్‌భవన్‌లో ఫిర్యాదు పెట్టే ఏర్పాటులో రాజకీయ అంతర్యం ఏమిటని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం కాంప్ కార్యాలయ కాన్పరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాండిచ్ఛేరిలో వారం రోజులుగా కరెంట్ నిలిచిపోయి అంధకారంలో ఉందన్నారు. ఆ రాష్ట్రానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై ఎందుకు స్పందంచడం లేదన్నారు. కేంద్ర పాలిత రాష్ట్రంలో గవర్నర్‌కు సర్వ ఆధికారాలు ఉన్నాయని అక్కడి సీఎం ఇంటికి, గవర్నర్ ఇంటికి కూడా కరెంట్ నిలిచి పోయిందన్నారు. ఇందుకు కేంద్రం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలే కారణ మన్నారు. అక్కడ మాత్రం గవర్నర్ ఫిర్యాదుల పెట్టే ఎందుకు ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాజ్‌భవన్‌లో మాత్రమే ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయడంలో రాజకీయ అంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసు కొస్తున్న విద్యుత్ సంస్కరణల ముసాయిద బిల్లు ఆమోదం కాలేదని అయినా ప్రైవేటీకరణ చేయాలని ఒత్తిడి తీసుకొ స్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రాల చేతిలో డిస్కమ్‌లను లాక్కుందని తాజాగా ట్రాన్స్‌కోను ప్రైవేటు చేయాలని ఇటీవల కేంద్రం లేఖ రాసిందని గుర్తు చేశారు.ఈ సంస్కరణలతో తెలంగాణకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల ఉచిత కరెంట్ అందకుండా పోయే ప్రమాదం లేకపో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీలో మోటర్లకు మీటర్లు పెట్టి అక్కడి రైతులపై కరెంట్ల బిల్లుల భారం వేస్తుందన్నార. ఇటివల వైజాగ్‌లోని సీపీడీసీఎల్ పరిధిలో కూడ అమలు చేస్తుందని గుర్తు చేశారు. గిరిజన యునివర్సిటీకి భూసేకరణ చేసి అప్పగించి ఐదేళ్లయినా దాని ఊసేత్తకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హా మీలను అమలు చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రైవేట ీకరణ చేయడమే పనిగా పెట్టుకొందన్నారు. ఇలాంటి తరణంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేసి నిజమైన ప్రజాపాలన అందించాలని సంకల్పించారన్నారు. ఇందుకు అనేక రాష్ట్రాల నుంచి సానుకూలత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ దేశంలో నూతన శకానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, జెడ్పీ వైఎస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, రైతు సమ న్వయ సమితి డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైఎస్ చైర్మన్ మునిగాల వెంక ట్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, గుంటి కిషన్, నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, దార్ల రమాదేవి, ఖానాపురం ఎంపీపీ వేములపెల్లి ప్రకాష్‌రావు, నామాల సత్య నారా యణ, భద్రయ్య, కోమండ్ల జైపాల్ రెడ్డి, సూరయ్య, రాంనర్సయ్య పాల్గొన్నారు.