Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవి ర్భావంతో సీఎం కేసీఆర్ కు మండల ప్రజలకు కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బుధవారం టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలతో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండే మల్లయ్య, జెడ్పిటిసి పత్తి నాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, మాజీ జెడ్పిటిసి రాంరెడ్డి, గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, దొంగల రాజకుమార్, గ్రామశాఖ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పర్వతగిరి : విజయదశమి సందర్భంగా కేసీఆర్ టిఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి పార్టీగా ప్రారం భిం చిన నేపథ్యంలో మండల కేంద్రంలో మండల పార్టీ అధ్య క్షతన సర్పంచ్ చింత పట్ల మాలతి, ఎంపీటీసీ మాడు గుల రాజు, ఉప రంగు జనార్దన్, గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లునావత్ కమల పంతులు. జడ్పీ కో ఆప్షన్ ఎండి సర్వర్, సోషల్ మీడియా కన్వీనర్ బొట్ల మధు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పరిపాలన విషయంలో సమర్థవంతంగా ఉండేందుకు టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి పేరును ఖరారు చేసిన సందర్భంగా గురువారం మేడారంలో వనదేవతల సన్నిధిలో నేతలు కార్యకర్తలు దండుగుల మల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా బాణాసంచాలు కాలుస్తూ రంగులు పూసుకుని సంబ రాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మే డారం ట్రస్ట్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఆలం శోభా రాణి, పార్టీ మైనార్టీ నాయకుడు రఫిక్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయిలో గురువారం టిఆర్ఎస్ పార్టీ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణచందర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినో త్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవి ర్భావం భారతదేశానికి ఒక శుభసూచకమన్నారు. సీఎం కేసీఆర ఒక వ్యక్తి కాదు ఒక గొప్ప శక్తి అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోని ప్రపంచానికి తెలిసిందన్నారు. అనంతరం కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చల్వాయి గ్రామ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.