Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) అధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట భారీ ధర్నా
నవతెలంగాణ-గార్ల
స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో అదనపు వైద్యలు లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర వైద్యం అందగా అనేకమంది చనిపోతున్నారని, అయినా పట్టించుకో కపోవడం శోచనీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 30 పడకల ఆసుపత్రిలో అదనపు వైద్యులు, సిబ్బందిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ మండలం గార్లలో ఎన్నో ఏండ్ల తరువాత నూతనంగా నిర్మించిన 30పడకల ఆసుపత్రి ని వైద్య విధాన పరిషత్గా అప్ గ్రేడ్ చేసి సంవత్సరం కావస్తున్నా ఇంత వరకు పూర్తి స్దాయిలో వైద్యులను, సిబ్బందిని ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో వైద్యం అందక మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం మండలంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతిచెందగా, ఇద్దరు వ్యక్రులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారని, అదనపు వైద్యులు లేక క్షతగాత్రులను ఖమ్మం హాస్పిటల్‌కు తరలించి దుస్తితి నెలకొందన్నారు. ఇటీవల ప్రమాదాలకు గురైన పలువురు బాధితులు తీవ్రమైన గాయాలతో స్థానిక హాస్పిటల్‌కు రాగా పూర్తి స్దాయి వైద్యం అందక ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్ళి లక్షల రూపాయల ఖర్చులు చేసుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి అదనపు వైద్యులు, సిబ్బంది ని ఏర్పాటు చేసిమెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని సూపరింటెండెంట్ రాజేష్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల కమిటీ సభ్యులు భూక్య హరి, ఎం గిరి, వి వెంకటేశ్వర్లు, ఈశ్వర్ లింగం, ఎ సత్యవతి, రాజారావు, లోకేశ్వరావు, గోవింద్, ఉపేందర్ రెడ్డి, ఎల్లయ్య, వీరభద్రం, శ్రీను, వెంకటేశ్వర్లు, కై బాబు,రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.