Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణి రీజినల్ స్థాయి సాంస్కతిక పోటీలు 2022-23 సంవత్సరానికి గాను వర్కింగ్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఈ పోటీలకు ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా ఆర్జీ-3, భూపాలపల్లి ఏరియా కళాకా రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమని, గెలుపొందిన కళాకారులు కోల్ ఇండియా స్థాయిలో పాల్గొని సింగరేణికి పథకాలు తీసుకువాలని ఆకాంక్షించారు. రీజినల్ స్ధాయిలో గెలుపొందిన కళాకారులు ఈ నెల 13,14 తేదీలలో భూపాలపల్లి ఏరియాలో జరిగే కంపెనీ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్. విజ య ప్రసాద్ ఎస్ఓ టు జిఎం,అజ్మీర తుకారం ఏరియా అధికార ప్రతినిధి , గౌరవ క్రీడల కార్యదర్శి గుండు రాజు సీనియర్ పిఓ, పోటీలకు న్యాయ నిర్ణీతలుగా స్వామి, పర్స శ్రీనివాస్ స్పోర్ట్స్ సూపర్వైజర్,పాక శ్రీనివాస్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్, ఉత్తమ్ కుమార్ కమ్యూనికేషన్స్ సెల్ కోఆర్డినేటర్, ఎస్. శ్రీనివాస్ రెడ్డి జనరల్ కెప్టెన్, రంజిత్ కల్చరల్ కెప్టెన్ తదితరులు పాల్గొనడం జరిగింది.