Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివ్యాంగులు దేవతా మూర్తులు
- ప్రజా శ్రేయస్సు జీఎంఆర్ఎం ట్రస్ట్ లక్ష్యం
- త్వరలోనే నియోకవర్గ వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
మానవసేవే మాధవసేవ అని, దివ్యాంగులు దేవత మూర్తులని భూపాలపల్లి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రజలకు ఆపద్భాందువులా జీఎంఆర్ఎం ట్రస్ట్ పని చేస్తుం దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కవనెంట్ చర్చిలో జీఎంఆర్ఎం, ఐసీఎం సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా అందించే వీల్చైర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్య క్షురాలు గండ్ర జ్యోతిలు ముఖ్య అతిథిగా హజరై 30 మంది దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దివ్యాంగులకు సమాజంలోని ప్రతి ఒక్కరు చేయూతనందించాలన్నారు. దివ్యాంగులు ఆధైర్యపడవద్దని, దివ్యాంగుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభు త్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జీఎంఆర్ఎం ట్రస్ట్ కూడ తమవంతు సహకారం అందిస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే భూపాలపల్లి పట్టణం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, వర్గాలు ము గిసిన వెంటనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జీఎం ఆర్ఎం ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తాన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం : జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
రాష్ట్రంలో అన్ని కులాలు, మతాల అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని దేశంలో బిఆర్ఎస్ అధికా రంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని జిల్లాలో పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు జీఎంఆర్ఎం ట్రస్టు పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలని అన్ని మతాలు, వర్గాల ప్రజలు మనస్పూర్తిగా కోరుకుందామన్నారు. సమాజంలో పదిమంది బాగుపడితే సంతోషించే గొప్ప వ్యక్తి తమ మామ గండ్ర మోహన్ రెడ్డి అని ఆయన పేరుతో ట్రస్ట్ నడిపించడం తమ అదష్టమన్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఉచిత శిక్షణ ఇవ్వడంతో వినూత్నమైన రీతిలో జిల్లాలోని యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ పెట్టి విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ పటేల్, పిఎసిఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్, కౌన్సిలర్లు నూనె రాజు పటేల్, శిరుప అనిల్, బట్టీ సమ్మయ్య, పానుగంటి హరీక శ్రీనివాస్, జక్కల రవికుమార్, సజ్జనపు స్వామి, మంజాల రవీందర్, చల్లా రేణుక, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్లు ఇర్ఫాన్, కమల, టీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు సాంబమూర్తి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అర్బన్ అధ్యక్షుడు మోడి అశోక్, నాయకులు పైడిపెల్లి రమేష్, జాగరి ఆజరు యాదవ్, బెడ్డల పోషయ్య అశోక్, బీబీచారి, పిల్లి వేణు, చింతనిప్పుల వెంకన్న, పాస్టర్లు జాన్ రమేష్, మనోహర్, రాజ్ కుమార్, టీఆర్ఎస్ యూత్ నాయకులు, గండ్ర యువసేనా నాయకులు, పాల్గొన్నారు.