Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సీపీఐ జాతీయ 24వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ కోరారు. శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైళ్లు ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వెళ్లాలని, ప్రజలు వేలాదిగా వరంగల్ జిల్లా నుండి తరలి వెళ్తున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం దోపిడి పాలక వర్గాల నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా విస్తత పోరాటాలకు మహాసభలు మార్గం చూపుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బస్సా రవీందర్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు పాల కవిత, జిల్లా సమితి సభ్యులు మియా పురం గోవర్ధన్, మహిళా సమైక్య మండల అధ్యక్ష కార్యద ర్శులు మమత, శైలజ, సిపిఐ నాయకులు అయితే యాకుబ్, సోములు, సతీ ష్, మంజుల,అశోక్, రవి, స్వప్న, రజిత, దేవన్న సురేష్ పాల్గొన్నారు.