Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సర్దార్ సింగ్ తెలిపారు. ఓటింగ్, కౌంటింగ్ అనంతరం ఫలితాలను వెల్లడించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘానికి జరిగిన ఎన్నికల్లో 450 ఓట్లకు గాను 450 ఓట్లు పోలు కాగా వీటి లో 14 ఓట్లు చెల్లకుండా పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వీరిలో పులుగుజ్జు వెంకన్న, కుక్కల రఘుపతి, బండి రమేష్, యాట రఘు, పుప్పాల కిరణ్ కుమార్, మోపిదేవి వెంకటేశ్వరరావు, మేకల కొమురయ్య , కుక్కల రమేష్, బోయిన ఐలయ్య ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. తిరిగి సోమవారం ఇదే కార్యాలయంలో సొసైటీ కార్యవర్గం డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
సభ్యులందరి సమష్టి విజయం : పులిగుజ్జు
సహకార సంఘం సభ్యులందరి సమష్టి విజయం అని పులిగుజ్జు వెంకన్న అన్నారు. ఫలితాల అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడుతూ బాబారు నమ్మకం నుంచి గెలి పించిన ప్రతి ఒక్కరికి హదయపూర్వక కృతజ్ఞతలు తెలి పారు. ఓటింగ్లో పాల్గొన్న అందరికి పేరుపేరున వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. మాపై ఉంచిన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా సంఘం అభివృద్ధికి అందరి సమష్టి కృషి చేస్తామని తెలిపారు.