Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
గర్భిణీలకు మెరుగైన సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. గర్భి ణీలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని ఒకరు ఫోన్ చేయగా వెంటనే ఆయన జిల్లా ప్రధాన ఆసుపత్రిని శుక్రవారం సందర్శించి ప్రత్యేకంగా గర్భిణీలను పరీక్షించడం ప్రత్యేక వైద్య నిపుణులు గైనకాలజిస్ట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహిం చారు. ఆసుపత్రిలో గర్భిణీలు అధిక సంఖ్యలో పరీక్షల కోసం రావటాన్ని గుర్తించిన డిఎంహెచ్ఓ తాను కూడా స్వయంగా గర్భిణీలను పరీక్షించి తగిన చికిత్సలు సేవలు అందించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ తో అధిక సంఖ్యలో వస్తున్న గర్భిణీలను ఉద్దేశించి వారంలో సోమ, బుధ ,శుక్ర, మూడు రోజులు గర్భిణీలను ఇద్దరు గైనకాలజిస్టులు ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం అవుట్ పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. ఐదుగురు డాక్టర్లు ఔట్ పేషెంట్లో సేవలందిస్తున్నారు. ఔట్ పేషెంట్ రిజిస్టర్స్ మెయింటెన్స్ చేయాలని సూచించారు. తరువాత డిస్పె న్సరీలో మందులు వితరణ జరుగు విధానాన్ని పరిశీలిం చా రు. మందుల నిల్వలు అత్యవసర మందులు తదితర వా టిపై అక్కడ డ్యూటీలో ఉన్న ఫార్మసిస్టులకు తగిన సూచనలు సలహాలు అందించారు.