Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ సభ తీర్మాణాల ద్వారానే పట్టాలివ్వాలి
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-వెంకటాపురం
పోడుదాడులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పర్షిక రాంబాబు అధ్యక్షత న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళితులకు, గిరిజనులకు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీ చేస్తున్న వ్యవసాయ, కూలీలకు కనీసవేతన చట్టం ప్రకారం కూలీ రేట్లు భవిష్యత్తులో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, వంకా రాములు, కట్ల చారి, కంటెం సత్యం, కారం వెంటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.