Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
దసరా, బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు చేసిన అధికారుల పనితీరు అభినందనీయమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులతో ఉత్సవాల ఏర్పాట్ల విజయవంతం పై నిర్వహించిన సమీక్ష సమా వేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బల్దియా పరిధిలో 142 ప్రాంతాల్లో రూ. 1 కోటి 54 లక్షల వ్యయంతో ఉత్స వాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు సమన్వ యంతో దసరా, బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేశారన్నారు. కాంపౌండ్ ఏరియా పథకం లో భాగంగా బల్ది యా పరిధిలో 20 యు.ఎల్.ఎస్.ఆర్ (వాటర్ ట్యాంక్)లను నిరంతర నీటి సరఫరా (24/7) కోసం ఎంపిక చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈ. ప్రవీణ్ చం ద్ర, సిఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎం.హెచ్.ఓ. డా. రాజేష్, ఈఈ.లు రాజయ్య, బి.ఎల్. శ్రీనివాసరావు, సంజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.