Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ కలెక్టర్ గోపి
నవతెలంగాణ-వరంగల్
అటవీ భూముల విచారణ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ బి గోపి అన్నారు. కలెక్టర్ సమావేశం మందిరంలో శుక్రవారం ఫారెస్ట్ బెస్ట్ బీట్ ఆఫీసర్స్, రెవెన్యూ అధికారులతో, పంచాయతీ సెక్రటరీలతో పోడు భూముల సమస్య పరిష్కారానికి అవగాహన సదస్సును నిర్వహిం చారు. సదస్సులో కలెక్టర్ పాల్గొని కార్యదర్శులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో కైమ్స్ 7711 వచ్చాయని, వాటిని పరిష్కరించుటకు అర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రభుత్వం ఏర్పా టు చేసిందన్నారు. ఈ యాప్‌ను పంచాయితీ సెక్రెటరీల మొబైల్లో ఇన్స్టాలేషన్ చేయించి ట్రయల్ రన్ ఏర్పాటుతో పాటు వారికి అవగాహన కల్పిం చారు. ఈ యాప్ ప్రతి హ్యాబిటేషన్ వారీగా డేటా, ఫారెస్ట్ డేటా ఒకే లా ఉండాలన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ జీపీ సెక్రటరీలు కోఆర్డినేషన్‌తో పనులు చూసుకోవాలని సూచిం చారు. 15 మందితో కూడిన ఎఫ్అర్సి కమిటీ మెంబర్స్‌ను ఏర్పాటు చేశామని, వారి కో- ఆపరేషన్‌తో ముందుకు వెళ్లాలన్నారు. ఈ రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి సర్వే చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి హ్యాబిటేషన్ వారీగా మండల్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీల్డ్ విజి టింగ్ చేయాలని, వారిలో పోలీసు శాఖ తప్పనిసరి అన్నారు. ఈ ప్రక్రియ 20 రోజుల్లో పూర్తి చేయాలని తెలి పారు. చిన్న చిన్న క్లెయిమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ముందుగా తీసుకుని ప్రజలకు అర్ధం అయ్యే విధంగా చెప్పాలన్నారు. నెక్కొండ ఎంపీడీవో మరణించినందున వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, అదనపు కలెక్టర్ ఎల్బీ హరిసింగ్, ఆర్డివో మహేందర్‌జీ, డిఆర్డివో సంపత్ రావు, సిపివో జీవరత్నం, డిటిడిఓ ఎస్.కె జహీరుద్దీన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.