Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) హనుమకొండ జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-వరంగల్
మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జర్నలి స్టులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని సిపిఐ(ఎం) హను మకొండ జిల్లా నాయకులు సారంపెల్లి వాసుదేవరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవ తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ బోయినపల్లి దేవేందర్రావు ఆధ్వ ర్యంలో నవతెలంగాణ జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యం శిక్షణ తరగ తులు నిర్వహించారు. కార్యక్రమానికి శాయంపేట రిపోర్టర్ బాల్నేని తిలక్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకు అందించి వారిని చైతన్యపరచాలని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బొక్క దయాసాగర్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని. ఏ సంఘ టననైనా సునిశిత దృష్టితో పరిశీలించాలన్నారు. సమగ్ర సమాచారం తెలుసుకొని వార్తను పాఠకులకు ఆసక్తి కలిగించే విధం గా రాయాలన్నారు. కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీకాంత్ మా ట్లాడుతూ పాఠకులకు ప్రత్యేకమైన కథనాలు అందిస్తేనే సమా జంలో జర్నలిస్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకుడు కంజర్ల నరసింహారాములు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్య విద్యార్థులుగా ఉండాలన్నారు. ప్రతి విషయాన్ని సూటిగా, స్పష్టంగా పాఠకులను ఆకర్షించే విధం గా వార్తలను అందించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ డెస్క్ ఇన్చార్జి బండి రాజు, స్థానిక రిపోర్టర్లు మోరె రమేష్, చిరంజీవి, వివిధ జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.