Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు పోరాటాలకు నాయకత్వం
- ఆశయాన్ని నమ్ముకున్న ఆదర్శ
- కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు
- కడవరకు ఎర్రజెండాను వీడని వ్యక్తి
- అన్నబాటలోనే తమ్ముడు పుల్లారావు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జీవీ 12వ వర్దంతి సభ
నవతెలంగాణ-వెంకటాపురం
పేదల సమస్యలపై పోరాటాలే ఆయన ఊపిరి.. కడవరకు ఎర్రజెండాను వీడని వ్యక్తి గుర్రం వెంకటేశ్వరరావు.పేదల పక్ష పాతి...ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేదల హక్కుల పరిరక్షణ కో సం, సాధనకోసం నిరంతరం పోరాడిన వ్యక్తి.. ఒక దశలో తనకు ఉన్న వ్యాపారాలను పక్కన పెట్టి పార్టీలో కొనసాగాలని జిల్లా, డివిజన్ కమిటీ ఆదేశాల మేరకు ఉద్యమాలే ఊపిరిగా పేదల పక్షాన పోరాటం సాగించారు. మార్క్సిజమే ఆయన ఊపిరి. ఎర్ర జెండా అంటే ఆయనకు ఇష్టం. నిస్వార్దంగా పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేసిన వ్యక్తి గుర్రం వెంకటేశ్వర్లు. సామాజిక సేవా దృ క్పధంతో ప్రజలకు అంకితమై పని చేసిన నాయకుడు. పుట్టింది ధనిక కుంటుబమైనా ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గ హక్కుల కోసం కృషి చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో పుట్టిన ఆయన వ్యవసాయ పనులపై వెంకటాపురం మండలానికి వచ్చారు. వ్యా పార దోపిడికీ వ్యతిరేకంగా,రైతుగా స్దిరపడాలని అనుకున్న ఆ యన కూలీల పక్షాన నిలబడ్డారు. ఆలుబాక, వీరభద్రవరం, వీఆ ర్కెపురం,మరికాల, వెంకటాపురం గ్రామాల్లో ఉన్న భూస్వాములు ధనిక రైతులు కూలీలకు తక్కువ కూలి ఇచ్చే వారు. కనీస వేతనం అమలు చే యాలని జరిగిన సమ్మెలు పోరాటాలకు నాయకత్వం వహిం చా రు. నిరం తరం ప్రజల మధ్యలో ఉం టూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పార్టీ కోసం తన వ్యాపా రాలను పక్కన పెట్టాలని పార్టీ ఆదే శిస్తే క్రమ శిక్షణతో తన వ్యాపారాలను వదులుకున్నాడు. పార్టీ నిర్మాణానికి కట్టుబడి పనిచేసి నిస్వార్దంగా పార్టీ క్రమశిక్షణకు లోబడి కార్య కర్తల పక్షాన పోరాడారు. కార్యకర్తలు, నాయకులతో ఐక మ త్యంగా మెలిగేవారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ బేధా లు వచ్చి నప్పుడు వాటిని రూపుమాపడంలో ఒక సమన్వయ కర్త గా పనిచేసేవాడు. డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకుడిగా పనిచేస్తూ పార్టిలో అంచలంచెలుగా ఎదుగుతూ 2006 నుంచి 2009 వరకు పార్టీ మండల కార్యదర్శిగా పని చేశారు. 2010లో గుండెపొటుతో మృతిచెందాడు. ఈయన మృతి పార్టీకి, ప్రజా సంఘాలకు తీరనిలోటని చెప్పవచ్చు. ఆయన పార్టీకి చేసిన సేవ లను గుర్తించి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంట ర్లో ఆయన స్మారక స్తూపాన్ని నిర్మించారు. 2010 నుంచి నేటి వరకు అక్టోబర్ 8న పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, అభి మానులు వర్దంతి సభను నిర్వహించుకుంటున్నారు.
జీవి వర్దంతి సభకు హాజరుకానున్న
ములుగు, భద్రాద్రి జిల్లాల నాయకులు
అమరజీవి గుర్రం వెంకటేశ్వర్లు 12వ వర్దంతి సభ శని వారం స్థానిక రోడ్లు భవనాలశాఖ అతిథి గృహంలో నిర్వహిం చనున్నట్లు సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు గ్యానం శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. సీపీఐ (ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మచ్చ వెంక టేశ్వర్లు, దావూద్ తదితరులు హాజరుకానున్నారు. కార్యక్ర మా న్ని పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, వ్యాపారవర్గాలు, సన్ని హితులు అధిక సంఖ్యలో పాల్గొన్ని వర్థంతి సభను జయప్రదం చేయాలని కోరారు.
అన్న అశయ సాధనలో తమ్ముడు
తన అన్న ఆశయ సాధనలో తమ్ముడు గుర్రం పుల్లారావు పయనిస్తున్నాడు. మండల కేంద్రంలో వెంకటేశ్వర ఆటో మొ బైల్ షాపు నిర్వహిస్తున్న పుల్లారావు సామాజిక కార్యక్రమాల్లో ముందుకు నడుస్తున్నాడు. ఇటీవల కరోనా బాధితుల కోసం వ్యాపార జేఏసీకి కార్యదర్శిగా ఉంటూ బాధితులకు సాయం అందిస్తున్నాడు. సీపీఐ(ఎం) పార్టీ కార్యక్ర మాల్లో సైతం ముం దుండి తన అన్న ఆశయాలకు అను గుణంగా పనిచేస్తున్నాడు.