Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలోని 23వ వార్డులో మిలిటరీ కాలనీలో మహిళ పద్మ దసరా పండుగకు పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పద్మ తెలిపిన వివరాల ప్రకారం.... దసరా పండుగ ముందు పద్మ వారి పుట్టింటికి వెళ్లింది. తిరిగి శనివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం, బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. సుమారు రూ.50 వేల విలువైన నగదు, 4తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థలాన్ని ఎస్సై క్రాంతి సందర్శించి విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.