Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ వేడుకల్ని గ్రామంలో ఏర్పాట్లు చేస్తే తనపై ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఇప్పగూడెం ఇన్‌ఛార్జి సర్పంచ్ జక్కుల పర్శరాములు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కొందరు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ, తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ పర్వదినాన రాత్రి 10గంటల సమయంలో జక్కుల రాజయ్య ఇంట్లో కరెంట్ పోవడంతో విద్యుత్ అధికారులకు సమాచారం అందించి, ఎల్సీ తీసుకోగా తిరిగి అరగంట వ్యవధిలో కరెంటు వచ్చిందని అన్నారు. కాగా ఆ కాలనీ వాసులను రెచ్చగొట్టి తనపై కక్ష్యగట్టి ఆరోపణలు చేస్తున్నారని, ఈతీరు సరైంది కాదన్నారు. గతంలో కూడా తనపై దాడి చేయడానికి పలుమార్లు యత్నించారని అన్నారు. రాజకీయంగా వ్యక్తిగత ఆరోపణలకు కాకుండా, గ్రామాభివృద్ధికి సహకరించాలని, గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామనే అక్కసుతో, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జరిగిన పనులల్లో అవినీతి జరిగితే ఏలాంటి చర్చ కైనా సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శైలజా అజరు రెడ్డి, వార్డు సభ్యులు బొంకూరి లక్ష్మి, ధైద లెనిన్, లింగయ్య, దామెర రాజు, టీఆర్ఎస్ పలు శాఖల అధ్యక్షులు ఎన్నకూస రాంనర్సయ్య, జె రాజశేఖర్ రెడ్డి, ఏల్లాగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య, కో ఆప్షన్ మైబు పాషా, బొంకూరి దయాకర్, మహేష్, రవి, వారాల రాజు, వార్డు సభ్యులు బొంకూరి లక్ష్మి, ధైద లెనిన్, లింగయ్య, దామెర రాజు, గట్టు మల్లు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.