Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ-పాలకుర్తి
రైతుల ఆర్థిక అభివృద్ధికి పామ్ ఆయిల్ సాగు ఎంతో దోహద పడుతుందని జెడ్పి ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ముత్తారంలో పామాయిల్ సాగును శనివారం జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలకు బదులుగా పామ్ ఆయిల్ పంటలను సాగు చేసుకోవాలని సూచిం చారు. ఒక్క ఎకరాకు మొక్కలు 60 వరకు నాటుకోవచ్చని తెలిపారు. పామ్ ఆయిల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు. ఒకసారి పామ్ ఆయిల్ సాగు చేస్తే 20 సంవత్సరాల వరకు ఉపయోగంలో ఉంటుందని, ఒక్కో ఏడాదికి 10 నుండి 15 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. ఒక్కో టన్నుకు పదివేల నుండి 23 వేల వరకు ఉంటుందన్నారు. పామ్ ఆయిల్ సాగు పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు రైతులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతులు ఫామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పుస్కూరి హనుమంతరావు, పుషఉ్కరి రామారావు తదితరులు పాల్గొన్నారు.