Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
పంచాయతీ అవార్డుల కోసం జిల్లాలో జాతీయ బృందం పర్యటించనున్నందున గ్రామ స్థాయిలో సాధించిన ప్రగతి పై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అభివద్ధి కార్యక్రమాల సమాచారం, సంక్షేమ పథకాల సమా చార సేకరణ పై సంబంధిత అధికారులు, ఎంపీ డీఓలకు, ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాచారం కొరకు జిల్లాలోని 12 మండలాలకు తొమ్మిది బృందా లను ఏర్పాటు చేసి 281 గ్రామపంచాయతీలో చేప ట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మండలానికి మూడు గ్రామ పంచాయతీలోని 130 ప్రశ్నలు ఇస్తూ తగిన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించాలని మండల స్థాయి అధి కారులు అవగాహన కల్పించారు. కరోనా సమయం లో వ్యాక్సినేషన్, సాధారణ కాన్పు, కెసిఆర్ కిట్ల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించిన ఆధునిక వైద్య సౌకర్యాలు సబ్ సెంటర్ల వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, గ్రామ స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పనులు, బడి బాట పథకం, మధ్యాహ్న భోజన పథకం, స్వయం సంఘాల పనితీరు, బ్యాంకర్ల సౌకర్యాలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు మిషన్ భగీరథ తాగు నీరు, రైతుబంధు ఉపయోగం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం తదితర అంశాలు సేకరించి నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జెడ్పీ సీఈవో వసంత, డీఆర్డిఏ పీడీ రామ్ రెడ్డి, వైద్యాధికారి మహేందర్, పంచాయతీ అధికారి రంగాచారి, పౌరసరఫరాల అధికారి రోజా రాణీ, సంక్షేమ అధికారి జయంతి, విద్యాశాఖాధికారి రాము, వ్యవసాయ శాఖ అధికారి వినోద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసు, విద్యుత్ శాఖ అధికారి మల్లికార్జున్, సిపిఓ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.