Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సంద ర్భంగా జానకి రాజు మెమోరియల్ ఆధ్వర్యంలో బంజారా యువజన సేవా సంఘం అధ్వర్యంలో ఈ నెల 10 నుండి నాలుగు జిల్లాల స్థాయి కబడ్డీ, డాన్స్ బేబీ డాన్స్,ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు వ్యవ స్థాపక అధ్యక్షులు భూక్య కస్నా నాయక్ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారా యువజన సేవా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మాళోత్ శాంతి కుమార్, గేమ్స్ కార్యదర్శి భూక్య రమేష్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మర్రిగూడెం మిని స్టేడియంలో మహబూబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఆ జిల్లాల పరిధి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కబడ్డీ మొదటి బహుమతి రూ.15000, రెండవ బహుమతి రూ.8000, మూడవ బహుమతి రూ.4000, నాలుగో బహుమతి రూ.3000 వేలు, డాన్స్ బేబీ డాన్స్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ.5000, రూ.3000, రూ.1000 బహుమతి అందజేస్తామని తెలిపారు. వీటితోపాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు 9014118193, 9010943242, 7702601106, 9492064002 సంప్రదిం చాలని కోరారు. ఈ సమావేశంలో బంజార యువజన సేవా సంఘం నాయకులు భూక్య.రామ్ సింగ్, జవహర్ లాల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.