Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డోర్నకల్
మండల పరిధి హున్య తండా గ్రామంలో బొడహట్య తండాలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గుగులోత్ దేవిశంకర్నాయక్, ఉపసర్పంచ్ బోడ రమేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని తూచా తప్పకుండా ప్రతి తండాలో సీసీ రోడ్లను నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తమకు సహరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివద్ధి పథంలో ముందుకు నడపడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు బోడ వీరన్న, లాల, నవీన్, సుక్య, నందు, తదితర ముఖ్యులు పాల్గొన్నారు.