Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ రాష్ట్రంలో జీవో 342 ను సవరించి అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ సౌత్ మండల కార్య దర్శి దూడపాక రాజేందర్ డిమాండ్ చేశారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం 31వ డివిజన్ జ్యోతిరావు పూలే నగర్లో సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 200 యూనిట్లు, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో 300 యూనిట్లు దళితులకు ఉ చితంగా అందిస్తున్నారని గుర్తు చేశారు. జిల్లాలో అ మలవుతున్న 100 యూనిట్ల లబ్ధిదారులకు ఏడాది గా సబ్సిడీలు విడుదల కాలేదన్నారు. పెండింగ్లో ఉన్న అనేక బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 100 యూనిట్ల జీవోను సవరించి 300 యూనిట్లు ఉచితంగా అందించే వరకు దశల వారీగా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ధనవంతులకు విద్యుత్ మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుం దని, దళితులకు ఇండ్లకు మీటర్లు పెట్టి బలవంతంగా బిల్లులు వసూలు చేస్తుందని ఆరోపించారు. అంత ేకాకుండా దళిత కాలనీలపై విజిలెన్సు అధికారులతో దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తోం దని విమర్శించారు. ఈ విషయంలో కెవిపిఎస్ ఆధ్వ ర్యంలో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రౌం డ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి విద్యుత్ ఏఈల కు ప్రతి దళిత కుటుంబంతో దరఖాస్తు చేయించను న్నట్టు తెలిపారు. ఉచిత విద్యుత్తు అందేవరకూ పోరా టం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తా మని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సౌత్ మండల అధ్యక్షుడు మే కల రఘుపతి, కుమారస్వామి, వెంకన్న, విష్ణు, శంక ర్, యాకన్న, వెంకన్న, శ్రీను, సమ్మయ్య, హరికష్ణ, రజియా, రాధా, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.