Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-పరకాల
దీర్హకాలంగా పెండింగ్లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను పరిష్క రించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విఆర్ఎలు శనివారం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి వినతిపత్రం అందించారు. 76 రోజుల నుండి నిర్విరామంగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు సూర రాజు, అశోక్, రాజులు మాట్లాడుతూ ప్రభుత్వా నికి చిత్తశద్ధి లేదని అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేడు హా మీలను తుంగలోకి తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విఆర్ఎల సమ్మెకు డిఎస్పి మద్దతు
విఆర్ఏలు గత 76 రోజుల నుండి సమస్యల పరిష్కారానికి చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలబడి ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకొని వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు బొచ్చు నాగరాజు, శంకర్, కుమార్ డిమాండ్ చేశారు.