Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహాముత్తారం
కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ టీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబాలకు అండగా నిలు స్తుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్వచెర్ల రా జు, రైతుబంధు మండల కన్వీనర్ మార్క రాములు అ న్నారు. మహాముత్తారం మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జాగరి రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా పార్టీ నుండి మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శని వారం రమేష్ కుటుంబ సభ్యులకు మంథని నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు అం దజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని తెలిపారు. చెక్కు అందజేసినవారిలో సింగంపల్లి సర్పంచ్ బంధం స్వరూప, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ రాధారపు స్వామి, ముదిరాజ్ సం ఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అట్టెం రమేష్, బీసీ సెల్ మం డల అధ్యక్షుడు చీకట్ల లింగయ్యగౌడ్, బిఆర్ఎస్ మండల నాయకులు దాసరి జంగు, జాడి రాజేష్, బంధం నాగార్జున్, బంధం శ్రీను, ఆవుల రాజేందర్ సింగంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.