Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ జన్ను షీబారాణిఅనిల్
నవతెలంగాణ-హసన్పర్తి
పశువుల పెంపకంతోనే రైతులకు ప్రత్యామ్నయ లాభాలు సాధ్యమని కార్పొరేటర్ జన్ను షీబారాణి అనిల్ అన్నారు. గ్రేటర్ 3వ డివిజన్ పరిధి ఆరెపల్లి గోపాలమిత్ర కేంద్రంలో జిల్లా పశుగణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతి థిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడా రు. ఈ సందర్భంగా జిల్లా పశుగణాభివద్ధి సంస్థ కా ర్యవర్గ సభ్యులు సీహెచ్.ఉపేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా జేడీ డాక్టర్ ఎం.బాలక్రిష్ణ, షీప్ సొసైటీ ప్రెస ిడెంట్ కె.బిక్షపతి పాల్గొని పాడిరైతులకు పశుగ్రాసాల పెంపకం, పశువులకు వస్తున్న జబ్బులు, వాటి నివారణ, దూడలకు నట్టల నివారణ, పాడి రైతులకు ఆర్థికపరమైన నష్టాలు రాకుండా సలహాలు సూచన లు ఇచ్చారు. శిబిరంలో వరంగల్ మండలం లక్ష్మీపు రం పశువైద్యాధికారి డాక్టర్ డి.భగీరథి, ఖిలావరం గల్ డాక్టర్ మాలవిక, గీసుగొండ మండల డాక్టర్ వి. రమేష్ పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు, ఎదకు రాని పశువులకు, చూడి పశువులకు పరీక్షలు చేశారు. 53 పశువులకు చికిత్సచేసి ఉచితంగా మం దులు పంపిణీ చేశారు. 45 దూడలకు నట్టల నివార ణ మం దులు వేశారు. ఈకార్యక్రమంలో గోపాలమి త్ర సూపర్వైజర్ వై.రాజేశ్వరరావు, ఆరెపల్లి గోపాల మిత్ర గూడ రాజేష్, అనిల్, కుమారస్వామి, రాజు, ఇంటస్, జీడస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ రిప్రజెం టివ్లు, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.