Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత వృత్తి ని పరిశ్రమగా గుర్తించాలి
- కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్
- అబ్బపూర్లో రహదారిపై గీతకార్మికుల నిరసన
నవతెలంగాణ-ములుగు
కల్లు గీత కార్మికులకు తక్షణమే దళిత, గిరిజన బంధులాగా గౌడ బంధు ప్రకటించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని అబ్బపూర్, మల్లంపల్లిలోని తాటి వనంలో గీత కార్మికుల సమావేశం సోసైటీ అధ్యక్షులు అనగొండ శంకరయ్య గౌడ్, పెరుమాండ్ల రామచంద్రు గౌడ్ అధ్యక్షతన శనివారం నిర్వ హించారు. అనంతరం అబ్బాపూర్లోని తాటి వనం పక్కన మెయిన్ రోడ్పైన గౌడ్ బంధు ఇవ్వాలని నిరసన తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో రదయిన సొసైటీలను వెంటనే పునరుద్దరణ చేసి ప్రభుత్వం అందిస్తున్నా అన్ని సంక్షేమ పథ కాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో అరెల్లి రవిగౌడ్, మోలుగురి మొగిలి గౌడ్, మంద జనార్దన్, కక్కెర్ల సమ్మయ్య, కె రమేష్, కైరి మొగిలి, శంకర్, జగన్, రాజయ్య , వేణు, శ్రీనివాస్, అరెల్లి సదానందంతో పాటు కల్లు గీత కార్మిక సంఘం యువజన విభాగం కో కన్వీనర్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్ తో పాటు 100 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.