Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ములుగు జాతీయ రహదారిపై వీఅర్ఏ లతో కలిసి ప్రజా సంఘాల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతుగా ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్, సిపిఎం మండల కార్యదర్శి ఎండి అమ్జద్ పాషా పా ల్గొని మాట్లాడుతూ వీఆర్ఏలు 76వ రోజులు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. కేసిఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని, వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వీఆర్ఏల ఆత్మహత్యలకు కెసిఆర్ ని బాధ్యులు చేస్తూ 302 కింద హత్య కేసు నమోదుచేసి కెసిఆర్‌ను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. వీఆర్ ఏల సమస్యలు పరిష్కరించకుంటే మునుగోడు ఉప ఎన్నిక లలో పోటీ చేస్తారని, ఉపఎన్నికలలో వీఆర్ఏలను గెలిపించాలని అన్నారు. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నటరాజ్, వీఆర్ఏల సంఘం ములుగు జిల్లా అధ్య క్షులు పాండవుల మహేందర్, నరేష్, పరికరాల మహేష్, రాంబాబు, సురేష్, సాంబయ్య, కుమార్, అజ్మీరా దాసు, నూనె గంటి లలిత తదితరులు పాల్గొన్నారు.