Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
నవతెలంగాణ-వెంకటాపురం
ఏజన్సీలో సీపీఐ(ఎం) పార్టీని బలోపేతం చేయడమే గుర్రం వెంకటేశ్వర్లకు మనం ఇచ్చే ఘననివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి తుమ్మల వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రోడ్లు ,భవనాల శాఖ అతిధి గహంలో జీవి 12వ వర్ధంతి స భ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మా ట్లాడుతూ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లాలో పుట్టి ఈ ప్రాం తం లో వ్యవసాయ నిమిత్తం వచ్చి ఇక్కడ సీపీఐ(ఎం) పార్టీ కి ఆకర్షితు డైనాడన్నారు. ఉద్యమంలో చేరి యువజన సంఘం, రైతు సంఘం, ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాడన్నారు. మండలంలో సిపిఎం పార్టీ పెంచుటకు విశేష కషి చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తనకున్న వ్యాపారం, వ్యవసాయం వదిలి పార్టీ కోసం పని చేసిన త్యాగమూర్తి, గొప్పశీలి అని కొనియాడారు . మనం ఈ మండ లంలో పార్టీ పెంచుటకు మనం అందరం కషి చేయాలని సూచించారు. తొలుత మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన జీవీ స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడ నుంచి ర్యాలీ గా సమావేశం వద్దకు వెళ్లారు. కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వరరావు సోదరులు ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం పుల్లారావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజేందర్, జిల్లా నాయకులు వంకా రాములు, మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, గ్యానం వాసు, చారి, తోట నాగేశ్వరరావు, పర్శిక రాం బాబు, మాణిక్యం, కంటెం సత్యం, తులసి, ఇర్ప శ్రీను, రౌతు నర్సిం హారావు, పోశాలు తదితరులు పాల్గొన్నారు.