Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మోసం చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ-కాశిబుగ్గ
సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరు స్తానని మాట ఇచ్చి, తప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్వహించే వాల్మీకి జయంతిని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వాల్మీకి బోయ కులస్తులందరూ బహిష్కరిస్తున్నట్లు ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ వరంగల్ ఉమ్మడిజిల్లా ఉపా ధ్యక్షుడు పెనుకుల సాంబశివరాజు తెలిపారు. శనివారం ఏను మముల శివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమా వేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1956 కు ముందు ఎస్టీలుగా ఉన్న బోయలను ఏ కారణం లేకుండా, రాజకీయ లబ్దికోసం అప్పటి ప్రభుత్వం బి.సి 'ఏ ' లో చేర్చడంతో బోయలు విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ పరంగా చాలా వెనుకపడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బోయలను తిరిగి ఎస్. టి జాబితా లో చేరుస్తానని అనేక బహిరంగసభల్లో మాటిచ్చిన కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కంటితుడుపు చర్యగా చెల్లప్ప కమిషన్ వేసి చేతు లు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిర్వహించే జయంతి వేడుకల్లో పాల్గొంటే వారికి తగిన బుద్ధి చెబు తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయ కులు పెనుకుల రవీందర్, నిగ్గుల ఐలయ్య, పెనుకుల కుమా రస్వామి, మండల నాయకులు పెనుకుల రమేష్, రాజు, రామచంద్రం, మొగిలి, సదానందం, రవి, ఐలయ్య, మల్ల య్య, సమ్మయ్య, శ్రావణ్, నాగరాజు, ఎం.రమేష్, రవి చంద్రప్రసాద్, రాజు, పాల్గొన్నారు.