Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
సరైన పౌష్టికహారంతోనే సరైన ఆరోగ్యం వస్తుం దని జిల్లా రెవెన్యూ అధికారులు కూతాటి రమా దేవి తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆహార భద్రత పైన మహిళలు, పిల్లలు, దివ్యాం గులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణం లోని ఆడిటోరియం లో జిల్లా లోని సర్పంచులు, రేషన్ షాప్ డీలర్స్ కు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. జిల్లా సంక్షే మాదికారి ప్రేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి జిల్లా రెవెన్యు అధికారి రమాదేవి మ్యుఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా జిల్లా సంక్షేమాధికారిని ఈపి ప్రేమలత మాట్లాడుతూ 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను (ఎఫ్ఏఓ) స్థాపించారని, దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారని, అందులో భాగంగా ఈ సంవత్సరం '' ఆరోగ్యవంతమైన రేపటి కోసం నేడు సురక్షిత ఆహరం'' అనే సందేశం తో ఈ కార్యక్రమం ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చివరగా బాల కార్మిక వ్యవస్థకి సంబంధించిన లఘు చిత్రాలని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో బాలల రక్ష భవన్ కోఆర్డినేటర్ స్వాతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది హరికృష్ణ, నరేష్, భీమానాయక్, డిడబ్ల్యుఓ కార్యాలయ సిబ్బంది వెంకట్, ఇమ్రాన్, జిల్లాలోని వివిధ గ్రామాల మంది సర్పంచ్ లు, రేషన్ డీలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.