Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
బాలికలు మేల్కొని తమ హక్కు లను తెలు సుకోవాలని బాలల సంక్షే మ సమితి చైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్రావు అన్నారు. ఈ నెల 11 అంతర్జాతీయ బా లికా దినో త్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ అధికారి కె.శామ్యూల్ ఆదే శాల మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పంకెనలోని కేజీబీవీలో ఏర్పాటు చేసిన అవగా హన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడు తూ సమాజంలో నివసించే బాలికలకు బాలురుతో పాటుగా సమాన అవకాశాలను అందించి, వారిని అభివద్ధి పథంలో నడిపిస్తేనే సమాజం కూడా అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి 2012 అక్టోబర్ 11న ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపు కోవాలని సూచించిందని, ఆనాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా బాలికా దినోత్సవ వేడుక లు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని కస్తూరిబా గాంధీ బాలికల వి ద్యాలయాల్లో బాలికలకు చట్టాలు, బాలల హక్కు లు, వ్యక్తిత్వ వికాసం, బాలికలలో ఉన్న నైపుణ్యా లను వెలికితీయడం కోసం ఇట్టి అవగాహనా కార్య క్రమాలను, ఆటల పోటీలను నిర్వహిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికష్ణ, ఎల్సీపీఓ మొహినొద్ధిన్, సోషల్ వర్కర్లు లింగరా వు, శైలజ, అవుట్ రీచ్ వర్కర్ లక్ష్మీ ప్రసన్న, కేజీబీ వీఎస్ఓ కనకలక్ష్మీ, ఎమ్మెస్కె కోఆర్డినేటర్లు అనూష, మమత, చైల్డ్ లైన్ ప్రతినిధి ఆనంద్ తదితరు లు పాల్గొన్నారు.