Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిలి ప్రభుత్వ మహిళ కళాశాల(స్వయం ప్రతి పత్తి) కి మొట్టమొదటిసారి పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలకు వక్ష శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ డి పార్వతికి వక్షశాస్త్రంలో పరిశోధన చేసే విద్యార్థులకు మార్గదర్శ కత్వం వహించే అవకాశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం కలుగజేసింది. ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాలను కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ తాటికొండ రమేష్, విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ బి వెంకట రామిరెడ్డి ,పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ పి మల్లారెడ్డి , పింగిలి మహిళాకళాశాల ప్రధాన ఆచార్యులు బి చంద్రమౌళి సమక్షంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి డి.పార్వతికి కి అందజేశారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న డాక్టర్ డి.పార్వతిని కళాశాల అధ్యాపక బృందం అభినందించినది.ఈ కార్యక్రమంలో పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి సుహా సిని, వక్షశాస్త్ర విభాగదిపతి డాక్టర్ డి.పార్వతి, కళాశాల పరీక్షల నియంత్రణ అదికారి డాక్టర్ డి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.