Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
బల్దియా అవినీతి అధికారులపై సమగ్ర విచార ణ చేపట్టాలని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ స భ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అ న్నారు. గురువారం అదాలత్ సెంటర్ లో జిడబ్ల్యూ ఎంసి లో జరుగుతున్న అవినీతి ని అరికట్టాలని కోరు తూ జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ గత సంవత్సర కాలం నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి పేరుకుపోయిం దని అన్నారు. ఇంజనీరింగ్, పబ్లిక్, హెల్త్, అర్బన్ మలేరియా, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ ఇలా ప్రతి డి పార్ట్మెంట్లలో వరసగా అవినీతి బయట పడుతోం దని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో అవినీతి జరిగితే కమిషనర్‌తోపాటు 13 మందిపై చర్యలకు తీసుకు న్నారని అయినా కార్పొరేషన్ అధికారుల తీరు మా రట్లేదన్నారు. జిడబ్ల్యూఎంసి కార్మికుల పీఎఫ్ సొమ్ము సుమారు రూ.2 కోట్ల రూపాయలు అవినీతిపాలైంద న్నారు. బుధవారం రెవెన్యూ విభాగంలో ఏకంగా ఇద్ద రు ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కారని జీడబ్ల్యూఎంసీలో జరుగుతున్న అక్రమాల ను కట్టడి చేయడంలో పాలకవర్గం, కమిషనర్ విఫలమయ్యారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో అలకుంట్ల యకయ్య, దూడ పాక రాజేందర్, నోముల కిషోర్, ఎన్నము వెంకటేశ్వ ర్లు, కంచర్ల కుమరస్వామి, పల్లకొండ శ్రీకాంత్, మోతె సతీష్, జేడ రమేష్, దేవరాజుల సంపత్, పోట్లపల్లి రాజు,నరేష్, బానోత్ రామ, సప్పిడి మనోహర్, దాస రి నరేష్, పాకిడా రాణి, అనిత, అంజలి, నాగేశ్వరరా వు తదితరులు పాల్గొన్నారు.