Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోతే కేసులు ఎత్తివేస్తాం
- లొంగుబాటుకు కుటుంబ సభ్యులు సహకరించాలి
- మావోయిస్టు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోతే వారిపై ఉన్న కేసు లు ఎత్తివేస్తామని జనజీవన స్రవంతిలో కలిసిన మావోయి స్టులకు ఉపాధితోపాటు ప్రశాంత జీవనానికి జిల్లా పోలీస్శాఖఅండగా ఉంటుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి పట్ట ణం లోని సుభాష్ కాలనీ, సింగరేణి కమ్యూనిటీహాల్లో అజ్ఞాత మావోయిస్టుల కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో అండర్ గ్రౌం డ్లో ఏడుగురు మావో కుటుంబాలను ఎస్పీ కలిసి వారి యోగక్షేమాలు అడిగి తె లుసుకున్నారు. వారి జీవనోపాధి సాగు తున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మావోల కుటుంబ సభ్యులకు ఏలాంటి సమస్యలు ఎదురైనా అవస రమైనా వైద్య చికిత్సలు అందించడానికి జిల్లా పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు. అజ్ఞాత మావోయిస్టుల లొంగుబాటు కు సహకరించాలని తనని వారి కుటుంబంలో సభ్యునిగా భావించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల కుటుంబసభ్యులకు వైద్యఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మం దులు, కళ్ళ జోల్లు, దుస్తులు, అందజేశారు. మావోలు తమ కుటుంబం, తల్లిదండ్రుల కోరకైనా అడవి బాటని వీడి జనజీవన స్రవంతిలో కలసి తమ వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారన్నారు. అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వై ద్యం అందిస్తామన్నారు. వనం వీడి జనజీవనంలోకి రావాల ని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో సాధించేది ఏమీ ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు.
ఎవరైతే లొంగిపోతారో వారికి ప్రభుత్వ పరంగా పోలీసు సహకారం ఉంటుందని, వారిపైన ఉన్నకేసులన్నీ ఎత్తివేసి రివార్డు కూడా అందజేస్తామన్నారు. భూపాలపల్లి జిల్లా ఓఎస్డీ గౌస్ అలం మాట్లాడుతూ నక్సలైట్లు వారి సిద్ధాంతాలు, హింసతో సాధించేది ఏమీ లేదని, అడవిని వీడి జనజీవనంలోకి రావాలని, వచ్చేవారికి సహాయ సహకారా లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జ యశంకర్ భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ.రాములు, జీ.రామ్మో హన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సిద్దు వెంకటరాణి, డాక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నరసింహులు, పులి వెంకట్, రంజిత్ రావ్, అజయ్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసు అధికారులు, అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.