Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
కాటారం మండల కేంద్రంలోని ఓడిపిలవంచ గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిపూర్ ఎస్సీవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మురుగుకాలువలు నిండి వరద నీరు ఇళ్లలోకి వస్తున్నా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మ హేందర్ అన్నారు. ఎస్సీవాడలో డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు లేక రోడ్లన్నీ అస్తవ్యస్తం గా మారడంతో కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించడం లేదన్నారు. సమస్య పరి ష్కరించనిపక్షంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని మహేందర్ హెచ్చరించారు.