Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో టిఆర్ఎస్ నావ మునిగిపోవడం ఖాయమని, అందు క బీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయాలకు తెర తీశార ని బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేం ద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు భూక్య జవహర్లాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ము లుగు అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం, భూక్య జవహర్ లాల్ మాట్లాడారు. ఒక్కో స్కాం బయటపడే కొద్ది కేటీఆర్ నియంత్రణ కోల్పోయి పిచ్చెక్కినట్లు మా ట్లాడుతున్నాడని, తన స్థాయిని మరిచి మోడీని విమ ర్శించడం సిగ్గుచేటన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్, కేటీఆర్‌ల నియంత పోకడలతో అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. నిరుద్యోగు లు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు వారి అహంకార పూరిత మాటలతో విసిగి త్తి పోయారని, టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో తెరాస పాలన అంతమవుతుందని తెలిసి దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న ట్లు ప్రజలను మభ్య పెట్టా లని చూస్తున్నారని అన్నా రు. టిఆర్ఎస్ అవినీతి పా లనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరు ఊచలు లెక్క బెట్టక తప్పదని హెచ్చరించారు. ములుగు జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు ఉదతం చేయాలని కార్యకర్తలకు పిలు పునిచ్చారు. కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్య క్షుడు కొత్త సురేందర్, మండల అధ్యక్షుడు గంగుల రాజ్‌కుమార్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కరు ణాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రత్నా కర్ రెడ్డి,నాయకులు పత్తి నాగేశ్వరరావు, వీరస్వామి, అనిల్‌రెడ్డి, దర్శన్, రమేష్, సంతోష్, సురేందర్, రాజ్ కుమార్, రంజిత్, శ్రీధర్, రాజేందర్ ,రవి, సాయిరెడ్డి, రవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.