Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న వీఆర్ఏల కథ గురువారం సుఖాంతమైంది. తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వీఆర్ఏల డిమాండ్లకు సీఎస్ సోమేశ్ కుమార్ అంగీకరిం చడంతో వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకుల ప్రదేశాల మేరకు సమ్మెను విరమింప చేస్తున్నట్లు మండల వీఆర్ఏలు తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ మండల చైర్మన్ నాగుల రామ్మూర్తి మాట్లాడుతూ గ్రామస్థాయిలో విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి సానుకూల నిర్ణయం తెలపడం హర్షణీయం అన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే ప్రగాఢ విశ్వాసం ప్రభుత్వం పట్ల తమకు ఉందని తెలిపారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకుల ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. జేఏసీ కో ఛైర్మెన్ మహంకాళి యాకయ్య, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వెంకన్న, రాజ మొహమ్మద్, సింగరబోయిన రాజు, గాదె అశోక్, పద్మ, ప్రమీల, ముద్రబోయిన రాజు, శిరీష, రమ్య, సోమిరెడ్డి, మహేందర్, రాములు, సోమక్క పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత జూలై 25నుంచి నేటికీ 80రోజులు కావస్తున్నా సంద ార్భంగా వీఆర్ఏల జేఏసి ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని, ఈమేరకు విధుల్లో చేరుతున్నట్లు స్థానిక తహసీల్దార్ పూల్సింగ్ను కలిసి వినతి పత్రాన్ని అందించి, వివరించినట్లు వీఆర్ఏలు గురువారం తెలిపారు. ఆర్ఐలు అర్జున్, రవీందర్, అధ్యక్ష, కార్యదర్శులు పాలెపు శ్రీనివాస్, ఎలిశాల రాము, శివ, రమ్యజ్యొతి, యాదేశ్, అభి, రాజ్ కుమార్, రాజు, రాజేశ్వరి, మల్లేష్, పోతరాజు, నాగరాజు పాల్గొన్నారు.
నెల్లికుదురు : విధుల్లో వీఆర్ఏలు చేరుతున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్ వజ్లలా ప్రభాకర్ తెలిపారు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ యోగేశ్వరరావుకు సంఘం మండల అధ్యక్షుడు మద్దెల భాస్కర్ ఆధ్వర్యంలో వీఆర్ఏలతో కలిసి విధుల్లో చేరుతున్నట్లు తాసిల్దార్కు లేఖ అందజేశారు. వచ్చేనెల 7న తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే మళ్లీ ఉద్యమ కార్యాచరణ చేపడుతామని అన్నారు. మండల అధ్యక్షుడు మద్దెల భాస్కర్, ఉపాధ్యక్షుడు ఆశోద బుచ్చి రాములు, వీఆర్ఏలు సురేష్, అచ్చయ్య, రహిమాన్, వెంకటేశ్వర్లు, బిక్షపతి, నిర్మల, రామా, బీబీ, రామచంద్రు పాల్గొన్నారు.
వర్ధన్నపేట : 80 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టిన వర్ధన్నపేట మండలం వీఆర్ఏలు నాయబ్ తాసి ల్ధార్ పవన్ కుమార్కు రిపోర్ట్ చేసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ వరంగల్ జిల్లా కో చైర్మన్ పూజారి సురేష్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీవో రూపంలో వచ్చేవరకు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల జాబ్ చార్ట్ ప్రకారం గ్రామాల్లో మాత్రమే పనిచేస్తామని తహసిల్దార్, రెవెన్యూ డివిజన్, కలెక్టర్ కార్యాలయాల్లో పనిచేయమని తెలిపారు. నవంబర్ 7 తర్వాత ప్రభుత్వం మళ్లీ మోసం చేస్తే మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు బిర్రు ఎల్లయ్య, జిల్లా కో కన్వీనర్ సంకూరు సాంబయ్య, మండల విఆర్ఏ జేఏసీ చైర్మన్ కాగిత సంపత్, కో చైర్మన్ గుగులోతు స్వాతి, ప్రధాన కార్యదర్శి సంకురి ప్రవీణ్, కన్వీనర్ ఇటుకల సాంబరాజు, వీఆర్ఏలు బాలరాజు, పృథ్వి, ప్రతిభ, షబానా, సురేష్, తదితరులు పాల్గొన్నారు.