Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా
నవతెలంగాణ-దేవరుప్పుల
మునుగోడు ఉప ఎన్నికల్లో మతతత్వ బీజేపీని, బీజేపీ విద్వేష రాజకీయాలను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి మతతత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని అన్నారు. మతతత్వ ఏజెండా కలిగిన బీజేపీని ఓడించటం తెలంగాణ ప్రజల తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలను ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ బలప డడం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, బీజేపీ అవకాశవాదంతో ఉప ఎన్నిక తీసుకు వచ్చిందని తెలిపారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై అన్నిరకాల భారాలు మోపి అభివృద్ధి నిరోధక పాలన చేస్తున్నదన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజల హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతోందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ఉపా చట్టం లాంటి వాటిని ప్రయోగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ విస్తరణ అత్యంత ప్రమాదకరమని, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఫాసిజాన్ని నిలువరించాలన్నారు. ఆయన వెంట జిల్లా నాయకులు జీడి సోమయ్య, మండల నాయకులు చింత భాస్కర్ ఉన్నారు.