Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమాన పరుస్తున్నాడని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కంది కట్ల అనిల్, నియోజక వర్గ అధ్యక్షుడు కొమ్ము రమేష్ విమర్శించారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించటం అమరులను అవమానపరిచినట్టేనని ఎద్దేవా చేశారు. నాటి రజాకార్ల కన్నా కేసీఆర్ పాలన అత్యంత దయనీయంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో కేఈసార్ అక్రమ పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యమ సాధకులు, ఉద్యోగులు త్యాగాలు ఉన్నాయన్నారు. తెలంగాణా కు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసి అవమా నించిన చరిత్ర హీనుడు కేసీఆర్ అని విమర్శిం చారు. అమరుల ఆత్మ ఘోష తో కేసీఆర్ రాజకీయ పతనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బొక్కల ప్రమోద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు విడుదల కష్ణ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నరుకుడు రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు భూక్య సురేందర్, లోకేష్, రంజిత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.