Authorization
Tue March 04, 2025 02:41:18 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
వీధి వ్యాపారుల చట్టం అమలు చేయాలని, వీధి కార్మికులకు వ్యాపార వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపాలిటీ ఎదుట గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా తోపుడుబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అజరు సారథి రెడ్డి పాల్గొని మాట్లాడారు. వీధివ్యాపారులను గుర్తించి ఆదుకోవాలని కోరారు. కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ చైర్మన్ రామ్ మోహన్ రెడ్డి స్పందించి మాట్లాడుతూ వీధి వ్యాపారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కౌన్సిలర్ అజరు సారధి రెడ్డి, నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, బిచ్చు, భద్రయ్య, జ్యోతి, నిర్మల, శ్రీనివాస్, గణేష్, బాలాజీ, లింగ, పవన్, లక్ష్మన,యాకుబ్, సేలి, రమేష్, నరేష్ పాల్గొన్నారు.