Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయపర్తి
మునుగోడు నియోజకవర్గం తరహాలో గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం ( జీఎంపీఎస్ ) మండల అధ్యక్షుడు చందు మల్లేష్ యాదవ్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పిటిసి రంగు కుమార్గౌడ్కు జిఎంపీఎస్ సంఘం ఆధ్వర్యం లో వినతిపత్రం అందజేశారు. అనంతరం మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ నగదు బదిలీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. మండలంలో మొదటి విడతలో 1121మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేశారని, రెండో విడతలో 1120మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయాల్సి ఉందని వివరించారు. రెండో విడత గొర్రెల పంపిణీలో మిగతా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు బందెల బాలరాజు, యాదవ సంఘం అధ్యక్షుడు బండి లింగయ్య, ప్రధాన కార్యదర్శి చందు లింగయ్య, ఐనవోలు దేవస్థానం డైరెక్టర్ చిన్నల ఉప్పలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కుంట రమేష్, బక్కతట్ల సాయిలు, కసరబోయిన కుమార్, ఉడుత రాజు, కుంట మారయ్య, ఆవుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.