Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
సహకార సంఘాలను ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను బలోపేతం చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా పాడి పరిశ్రమాభివద్ధి శాఖా జిల్లా అధికారి ధన్ రాజ్, కాకతీయ కో ఆపరేటివ్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ లునావత్ యాకుబ్ నాయక్ అన్నారు. డివిజన్ పరిధిలోని జాఫర్ ఘడ్, చిల్పూరు, పాలకుర్తి, మండలాల విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల, పాడి రైతులకు స్థానిక రైతు వేదికలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘంలో ప్రాతినిథ్యం వహించాలంటే ప్రతీ ఒక్క లబ్దిదారులు రూ.300తో ప్రాథమిక సభ్యత్వం కల్గి ఉండాలని సూచించారు. కనీసంగా సభ్యుడిగా సాగాలంటే, రెండు పాడి పశువుల్ని కల్గి ఉండాలని తెలిపారు. సాధారణ సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం అందించే పథకాలను ప్రతీ పాడిరైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ధన్ రాజ్ మాట్లాడుతూ సహకార సంఘం పూర్తి స్థాయిలో నిర్వహిస్తూనే, దినదినం బలోపేతం చెందుతుందని, పాల దిగుబడిలో రైతులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు పాటించి ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వర్లు, రాజయ్య, సుధారాణి, జిల్లా ఛైర్మన్ సోమిరెడ్డి, చిల్పూర్ ఛైర్మన్ సాదం రమేష్, పాలకుర్తి ఛైర్మన్ తాడేం రవి, ఘన్ పూర్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, మేనేజర్ లింగారెడ్డి, సూపర్ వైజర్లు హన్మంతు, నాగరాజు, వెంకట్ రెడ్డి, జయసింహ రెడ్డి, రైతులు శ్రీనివాస్, వెంకటాద్రి, మహేందర్, సరితా, సుగుణమ్మ, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, రమేష్, పరుషరాం, భాస్కర్, నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.