Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం విలేఖరి పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడికి నిరసనగా గురువారం మహబూబాబాద్ జిల్లాకేంద్రం లోని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్లో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ,విద్యార్థి సంఘాల నేతలు అజరు సారధి,పెరుగు కుమార్ సాయికుమార్, శశికుమార్ జర్నలిస్ట్ సంఘాల నేతలు పర్కాల రవీందర్ రెడ్డి జర్నలిస్టుల ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. పల్లె సురేష్ పై దాడిని జిల్లా జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కల మధు, రంగా చౌదరీ, చిర్రగోని ఉదరు ధీర్, రాంప్రసాద్, గాడిపల్లి శ్రీహరి,కల్లూరి ప్రభాకర్,చందు, శెట్టి వెంకన్న,కిరణ్, సతీష్, సాయికుమార్,యస్వంత్, ప్రవీణ్ ,వీరేంధర్ తదితరులు జర్నలిస్టులు,పార్టీల నేతలు,విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.